Telugu language pack

ఆత్మసాక్షాత్కార శాస్త్రము ( Atma Sakshathkara Shasramu )

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

పరమ భాగవతులు, లోతైన ఆధ్యాత్మికభావన కలిగినట్టి నిజమైన సాధుపురుషులు అయినట్టి శ్రీల ప్రభుపాదులు ఆధ్యాత్మికత లోపించినట్టి మన సమాజము పట్ల ఎంతో అక్కర, కరుణ కలిగి ఉండేవారు. లక్షలాది సంవత్సరాలుగా ఎందరో ఆత్మదర్శులైన ఆచార్యులు పలికినట్టి కాలాతీత జ్ఞానాన్ని ఆయన మానవజాతి యొక్క జ్ఞానవికాసానికై నవీన ఆంగ్లభాషలో అనువదించారు. అటువంటి జ్ఞానము మనలో ఉన్నట్టి ఆత్మకు, ప్రకృతి మరియు విశ్వానికి, అంతర్బాహ్యాలలో ఉన్నట్టి పరమాత్మునికి సంబంధించిన రహస్యాలను వెల్లడి చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన పుస్తకములో శ్రీల ప్రభుపాదులు సుప్రసిద్ధ హృద్రోగ నిపుణునితో ఆత్మపరిశోధన గురించి చేసిన చర్చలు, పునర్జన్మ గురించి ఆయన లండన్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీకి వెల్లడి చేసిన వివరాలు, నిజమైన గురువులు మరియు కపట గురువుల గురించి ఆయన లండన్ టైమ్స్ పత్రికకు చెప్పిన విషయాలు, కృష్ణుడు క్రైస్తు అనే విషయము మీద ఆయన జర్మన్ బెనిడిక్టైన్ సన్న్యాసితో జరిపిన చర్చలు, ఆధ్యాత్మిక సామ్యవాదముపై సుప్రసిద్ధ రష్యన్ పండితునితో జరిపిన సంభాషణలో కర్మసిద్ధాంతము గురించి ఆయనకు ఉన్న పరిజ్ఞానము మున్నగు ఎన్నో విషయాలు అందించబడ్డాయి. ఈ ఆత్మసాక్షాత్కార శాస్త్రము అంతరంగములో స్ఫూర్తిని, జ్ఞానవికాసాన్ని ప్రేరేపించి ఆత్మ భగవంతునితో జతకూడడానికి శక్తిని కలిగిస్తుంది.

Sample Audio