గీతాసారము ( Gita Saram )
Description
శ్రీమద్భగవద్గీత భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలలో అత్యంత ఉత్కృష్టమైనది. అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులైన శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు క్రీ.శ. 1967వ సంవత్సరములో అట్టి భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి దివ్యమైన, విజ్ఞానదాయకమైన వివరణతో ఆంగ్లభాషలో వ్యాఖ్యానము వ్రాసారు. ఆయన కృష్ణభక్తిప్రచారానికై పాశ్చాత్యదేశాలకు వెళ్ళిన తొలిరోజులలో ఆ గీతాభాష్యాన్ని ముద్రించడానికి వీలుకాని కారణంగా దానిలోని ఉపోద్ఘాతాన్ని తొలుత చిన్న పుస్తకరూపంలో విడిగా ముద్రించారు. ఈ చిన్నపుస్తకము ఆనాడు ఆ విధంగా ముద్రించిన ఉపోద్ఘాతము యొక్క పునర్ముద్రణము.