language pack

ముకుందమాలా స్తోత్రము ( Mukundhamala Stotramu )

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

సేవాభాగ్యాన్ని తనకు కలిగించమని శ్రీకృష్ణుని వేడుకుంటూ ఒక రాజర్షి చేసిన ప్రార్థనలే ఈ ముకుందమాలా స్తోత్రము. రాజర్షి కులశేఖర మహారాజు భారతదేశంలో వేయి సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ కాలం క్రిందట నివసించినప్పటికీ ఆయన రచించిన ముకుందమాలా స్తోత్రము ఈనాటికీ క్రొత్త గొంతుతో సత్యాన్ని మనకు చెబుతూనే ఉంది. ఇది భగవంతుడిని, మనలను కూడ ఎంతో శ్రద్ధతో వేడుకున్నట్టి ఆత్మదర్శి వాక్కులు. జన్మమృత్యువులనే రోగానికి వైద్యం గురించి వినమని ఆయన జనులందరినీ పిలుస్తున్నారు. శ్రీకృష్ణుని పట్ల తనకు ఉన్నట్టి భక్తిని, తనకు కలిగిన పరమభాగ్యాన్ని ప్రతియొక్కరితో పంచుకోవాలనే తన ఆత్రుతను కులశేఖర మహారాజు అత్యంత సరళముగా ప్రకటించిన భావమే ఈ ముకుందమాలా స్తోత్రము.